మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (12:05 IST)

పాలు పోస్తే..లేచి కూర్చున్న శవం... పరుగులు తీసిన జనం

deadbody
తమిళనాడులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలళితే.. పుదుక్కోటై, ఆలంపట్టి, మురండాపట్టి గ్రామానికి చెందిన రైతు షణ్ముగం కాలేయ సమస్యతో బాధపడ్డాడు. గురువారం ఆస్పత్రిలో అతని పరిస్థితి విషమించడంతో  వైద్యులు అతను మరణించినట్లు తెలిపారు. 
 
మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి ఇంటిబయట కూర్చోబెట్టారు. తదనంతరం షణ్ముగం కుమారుడు తమ సంప్రదాయం ప్రకారం కడసారిగా తండ్రి భౌతికకాయం నోట్లో పాలుపోశాడు. 
 
అంతే ఒక్కసారిగా షణ్ముగం కళ్లు తెరిచాడు. దీంతో చుట్టూ వున్న వారంతా బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.