మజ్జిగ పులుసు తీసుకుంటే..?
పెరుగు లేదా మజ్జిగలో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా వుంటుంది. పులిసిన మజ్జిగలో ఇది రెట్టింపు వుంటుంది. పులిసిన మజ్జిగలో ఇది రెట్టింపు ఉంటుంది. ఇది పేగుల్లోని చెడు బ్యాక్టీరియాను నశింపజేసి మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది.
శరీరంలోకి ఎలాంటి వైరస్‌లు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మజ్జిగలోని ల్యాక్టిక్ ఆమ్లం శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఇందులో కొవ్వు, క్యాలరీల శాతం కూడా తక్కువే. శరీరంలోని వేడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.