మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 16 అక్టోబరు 2022 (13:54 IST)

హైదరాబాద్‌లో ప్రీమియం రియల్‌ ఎస్టేట్‌కు పెరుగుతున్న ఆదరణ

Ajitesh
గత రెండు సంవత్సరాల కాలంలో ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దానితో పాటుగా గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు కూడా మారాయి. చాలామందికి విలాసం, అవసరంగా మారింది. ఇప్పుడు ఈ విలాసం అరచేతికి అందేంత దూరంలోకి వచ్చింది. మరీముఖ్యంగా హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలలో!
 
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎన్నో నగరాలు ఉన్నప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ పరంగా అత్యంత ఆసక్తికరమైన నగరంగా మాత్రం హైదరాబాద్‌ నిలుస్తోంది. ఇక్కడ అమ్మకాలు 142% వృద్దిచెందాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే రెండు రెట్ల వృద్ధి గత సంవత్సరపు మొదటి ఆరు నెలలతో పోల్చినప్పుడు కనిపించింది. హైదరాబాద్‌లో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో 3 లేదా 4 బెడ్‌ రూమ్‌ అపార్ట్‌మెంట్‌లకు పెరిగిన డిమాండ్‌ ప్రీమియం రియల్‌ ఎస్టేట్‌కు పెరుగుతున్న ఆదరణ వెల్లడిస్తుంది.
 
అత్యున్నత శ్రేణి విభాగం ఇప్పటికీ త్రైమాసిక ఆవిష్కరణలలో సింహభాగం (47%) ఆక్రమిస్తుంటే, అనుసరించి మిడ్‌ సెగ్మంట్‌ 40% వాటా ఆక్రమిస్తోంది. గత త్రైమాసంతో పోలిస్తే మిడ్‌ సెగ్మంట్‌ ఆవిష్కరణలు ఈ త్రైమాసంలో 9% వృద్ధి నమోదుచేశాయి. హైదరాబాద్‌లో వృద్ధి చెందుతున్న ఈ ప్రీమియం రియల్‌ ఎస్టేట్‌ గురించి అశోకా బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌బీఎల్‌) ఫౌండర్‌-సీఈఓ, అజితేష్‌ కొరుపోలు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతుండటం, కాస్మోపాలిటన్‌ సంస్కృతి పెరగడం ఈ వృద్ధికి ఓ కారణమన్నారు. 
 
తెలంగాణా ప్రభుత్వ అంచనాల ప్రకారం ఐటీ/ఐటీఈఎస్‌ రంగంలో 2022 సంవత్సరంలోనే 1.5 లక్షల ఉద్యోగాలు కొత్తగా రానున్నాయి. ఇది కూడా రియల్‌ ఎస్టేట్‌ వృద్దికి దోహదపడుతుంది. హైదరాబాదీలు ఇప్పుడు విలాసం అందుబాటులోనే ఉందని భావిస్తున్నారన్నారు అజితేష్‌. గతంలో మైక్రో మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడని వారు ఇప్పుడు అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా కొండాపూర్‌, మణికొండ, నానక్‌రామ్‌గూడా, నార్సింగి, తెల్లాపూర్‌లో ఈ సంవత్సర మొదటి త్రైమాసంతో పోలిస్తే ధరలు 4-5% పెరగడం దీనికి సూచిక అని అన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే మెరుగైన మౌలికసదుపాయాలు కలిగిన్పటికీ అందుబాటులో జీవనవ్యయం ఉండటం కూడా ఈ నగరంలో  రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి చెందడానికి ఓ కారణమేనన్న అజితేష్‌ వినూత్న ఆవిష్కరణలను రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు వినియోగదారుల సౌకర్యార్ధం అందిస్తుండటం వల్ల లగ్జరీ  ఇక్కడ మరింత అందుబాటులోకి వచ్చిందన్నారు.
 
హైదరాబాద్‌లో యువతరం ధైర్యంగా రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుండటం, ప్రీమియం రియాల్టీకి ఆదరణ పెరుగుతుండటంతో ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ రంగం  భవిష్యత్‌లో కొత్త పుంతలు తొక్కనుంది.
- అశోకా బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌బీఎల్‌) ఫౌండర్‌-సీఈఓ, అజితేష్‌ కొరుపోలు.