శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (13:23 IST)

కారవాన్ తెప్పించుకుంటాం.. భర్తతో గడిపేందుకు అనుమతివ్వండి...

romance
జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం కేసులో అరెస్టు అయిన నిందితుడి భార్య కోరిన కోరికతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. తన భర్తతో రాత్రంతా గడిపేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇందుకోసం కారవాన్ తెప్పించుకుంటామని, అందులో ఒక రాత్రిపాటు ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరింది. దీంతో పోలీసులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. 
 
జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం, ఆమెను కులం పేరుతో దూషించిన కేసులో వర్థమాన హీరో ప్రియాంత్ రావును హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈయనకు భార్య, ఓ కుమార్తె కూడా ఉంది. భర్త అరెస్టు విషయం తెలుసుకున్న అతడి భార్య జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చింది. కేసు పరిస్థితి గురించి అడిగింది. పోలీసులు రిమాండ్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇంతవరకు బాగానేవుంది. కానీ చివర్లో తన భర్త కోసం స్టేషన్‌కు కారావాన్‌ తెప్పించుకుంటాం రాత్రంతా అందులో ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ భార్య విజ్ఞప్తి చేసింది. ఆమె కోరికతో పోలీసులు ఆశ్చర్యపోయారు. భర్త అరెస్టు అయినా బాధ లేదు కానీ కారావాన్‌ గురించి అడగటం విడ్డూరంగా ఉందని పోలీసులు వాపోవడం గమనార్హం.