శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 అక్టోబరు 2022 (23:14 IST)

అక్టోబర్‌ 15న జరుగనున్న ‘బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ ’కుకింగ్‌ పోటీల గ్రాండ్‌ ఫైనల్‌

image
బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ లైవ్‌ కుకింగ్‌ పోటీల గ్రాండ్‌ ఫైనల్‌  కెపీహెచ్‌బీ లోని ఇందు ఫార్చ్యూన్‌ గార్డెనియా వద్ద జరుగనుంది. ఈ ఇంటర్‌  హై రైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ లైవ్‌ కుకింగ్‌ పోటీలను హైదరాబాద్‌ వ్యాప్తంగా 20 గేటెడ్‌ కమ్యూనిటీల వాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సొసైటీ నుంచి ఓ ఫైనలిస్ట్‌ ఈ గ్రాండ్‌ ఫైనల్‌లో పాల్గొంటారు.
 
ఈ పోటీల ప్రాధమిక రౌండ్లకు అపూర్వ ఆదరణ లభించింది. దాదాపు 400 మందికి పైగా ఈ పోటీల్లో పాలుపంచుకున్నారు. ఆడిషన్‌ రౌండ్స్‌లో చిన్నారులు, యువత, పెద్దలు, సీనియర్‌ సిటిజన్లు తమ అసాధారణ పాకశాస్త్ర నైపుణ్యం ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి రత్నదీప్‌  రిటైల్‌  ప్రైవేట్‌ లిమిటెడ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించడంతో పాటుగా నూతన ప్రతిభావంతుల కోసం వర్క్‌షాప్‌ నిర్వహించింది.
 
ఈ సందర్భంగా రత్నదీప్‌ మార్కెటింగ్‌ డైరెక్టన్‌ యష్‌ అగర్వాల్‌  మాట్లాడుతూ, ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. హోమ్‌ చెఫ్‌లు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా తమ చుట్టుపక్కల వారితో బంధాన్నీ బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
 
ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ్ ఆయిల్స్‌ సేల్స్‌-మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, ‘‘తమ సొంత ఫుడ్‌ తామే వండుకోవడంతో పాటుగా విభిన్నమైన పదార్థాలు వాడటాన్ని ప్రోత్సహిస్తుంటాము. ఈ బెస్ట్‌ చెఫ్‌ పోటీ మా ప్రయత్నాలకు కొనసాగింపు. ఈ పోటీలకు అపూర్వ ఆదరణ లభించడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఎస్‌ఐపీఎల్‌ ఈవెంట్స్‌ ఫౌండర్‌ ప్రవీణ్‌ కె అగర్వాల్‌ మాట్లాడుతూ ఫైనల్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు.