1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (18:29 IST)

పొగమంచుతో కమ్ముకున్న హైదరాబాద్..

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ మంచుతో కప్పబడింది. నగరంలోని అమీర్‌పేట్‌, పంజాగుట్ట, కూకట్‌ పల్లి, ఎస్‌.ఆర్‌.నగర్,ఎల్బీనగర్‌, జూబ్లీహిల్స్‌. బంజారాహిల్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొండాపూర్‌, మాధాపూర్‌లలో పొగమంచుతో కూడిన వాతావరణం కలిపించింది. దీంతో నగరవాతావరణం చూస్తుంటే ఊటీని తలపించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది.

రోడ్లపై పొగమంచు కమ్ముకోవడంతో.. రాకపోకలకు అంతారయం ఏర్పడింది. కొంతరు ఆ మంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది.

కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం రెండు రోజుల పాటు రాష్ట్రంపై ప్రభావం చూపనుంది. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.