బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (19:57 IST)

చలికాలంలో జలుబు , దగ్గు.. ఈ మూడింటిని వాడితే..?

ayurveda method
చలికాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి వాతావరణం మారగానే దగ్గు, జలుబు సమస్య వేధిస్తుంది. దగ్గు బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్‌ల ద్వారా అలెర్జీల వల్ల కూడా వస్తుంది. వర్షాకాలంలో బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. 
 
ఎందుకంటే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల త్వరగా వ్యాధుల బారిన పడతాం. జలుబు, దగ్గు సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. జలుబు దగ్గు, సీజనల్ వ్యాధులను నివారించడానికి ఆయుర్వేదంలో సింపుల్ చిట్కాలు వున్నాయి. వంటింట్లో ఉండే సింపుల్ వస్తువుల సాయంతో జలుబు, దగ్గు సమస్యను దూరం చేసుకోవచ్చు. వీటిలో మొదటిది. 
 
1. అల్లం
చాలామంది టీలో అల్లాన్ని రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అయితే అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అల్లం టీ తాగడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
2. పసుపు
మారుతున్న సీజన్‌లో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు పసుపు పాలను తీసుకోవచ్చు. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు మారుతున్న సీజన్‌లో ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయి.
 
3. నల్ల మిరియాలు
వంటగదిలో ఉండే నల్ల మిరియాలను మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. అయితే ఇది మసాలా దినుసు మాత్రమే కాదు మారుతున్న సీజన్‌లో తలెత్తే అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే నల్ల మిరియాల పొడిని తేనెతో కలిపి వాడవచ్చు.