మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (13:27 IST)

విమానంలో చితక్కొట్టుకున్న ప్రయాణికులు

passengers fight
ఇటీవలికాలంలో విమానాశ్రయాల్లోనే కాకుండా విమానం లోపల కూడా అనేక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి విషయాలపై సహనం కోల్పోయిన ప్రయాణికులు తీవ్ర ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటున్నారు. ఇది విమాన సిబ్బందికి తలనొప్పిగా మారింది. తాజాగా థాయ్ ఎయిర్‌‍లైన్స్‌లో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. 
 
థాయ్ స్మైల్ ఎయిర్ వేస్‌లో ప్రయాణికుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ ఒకరిని ఒకరు చితక్కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ ఘటన బ్యాంకాగ్ నుంచి కోల్‌కతాకు వస్తున్న విమానంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ముందుగా వాగ్వాదంతో ప్రారంభమైన ఈ గొడవ ఆ తర్వాత చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఈ దృశ్యాలను తోటి ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. దీనిపై పౌర విమానయాన శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.