ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (17:51 IST)

నటుడు సుధీర్‌ వర్మ మృతి పై అనుమానాలు!

Sudhir Varma
Sudhir Varma
నటుడు సుధీర్‌వర్మ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వైజాగ్‌కు చెందిన మీడియా ఛానల్స్  పలు రకాల కథనాలు ప్రసారం చేస్తోంది. హైదరాబాద్‌లోనే మంచి ట్రీట్‌మెంట్‌ కలిగిన ఆసుపత్రులుండగా ఏడుగంటల జర్నీతో వైజాగ్‌కు ఎందుకు తీసుకెళ్ళారు? అసలు ఇలా తీసుకెళ్ళమని చెప్పిన బంధువులు ఎవరు? డాక్టర్‌ ఎవరు? అనే కోణంలో కథనాలు ప్రసారం చేస్తోంది. వైజాగ్‌కు చెందిన ఎల్‌.జి. ఆసుపత్రి యాజమాన్యంపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఆసుపత్రి డాక్టర్ల నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చాయని పోలీసులు తెలిపారు.
 
పైగా సుధీర్మ నివసించే ప్రాంతం దగ్గరలోనే శ్మశాసవాటిక వుంది. అక్కడ ఆత్మహత్య కేసులు వచ్చినట్లయితే అంత త్వరగా దహనకార్యక్రమాలు చేయరు. ముందుగా పోలీసులకు తెలియజేస్తారు. కానీ శ్మశానంలో కాటికాపరి అటువంటిది ఏమీ చేయకుండానే బంధువులు సూచన మేరకు దహన సంస్కారాలు చేశారని పోలీసులు చెప్పడం విశేషం. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. గతంలో బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ మరణంకూడా అనుమానాస్పందంగా మారిన విషయం తెలిసిందే.
 
జనవరి 18 అర్థరాత్రి హైదరాబాద్‌లో విషం తాగిన సుధీర్.. వెంటనే కొండాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. బంధువుల సూచన మేరకు జనవరి 20న విశాఖపట్నం తరలించగా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం నుంచి పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తర్వాత రోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
సుధీర్ 2013లో ‘సెకండ్ హ్యాండ్’తో తెరంగేట్రం చేశాడు.