శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (13:01 IST)

నన్ను చంపేందుకు రమ్య కుట్ర చేస్తున్నారు.. నటుడు నరేష్ ఆరోపణ

Naresh_Pavitra
తన మూడో భార్య రమ్యపై నటుడు నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు రమ్య కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆస్తికోసం తనను చంపే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఇదే విషయంపై ఆయన తాజాగా కోర్టును ఆశ్రయించారు. అలాగే, దీనిపై గచ్చిబౌలి పౌలీసులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. 
 
రోహిత్ శెట్టితో కలిసి రమ్య తనను చంపేందుకు కుట్రలు చేస్తోందని అన్నారు. ఆమెతో తాను నరకాన్ని అనుభవిస్తున్నానని, తనను, చంపేస్తారనే భయంతో ఒంటరిగా బయటకు కూడా వెళ్లలేకపోతున్నానని చెప్పారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్‌ను రమ్య హ్యాక్ చేయించి, తన పర్సనల్‌ మేసేజ్‌లను చూసేదని అన్నారు. తనకు రమ్యకు విడుకాలు ఇప్పంచాలని కోరారు.
 
కాగా, గత 2010 మార్చిలో రమ్యతో తనకు బెంగుళూరులో పెళ్లి జరిగిందని నరేశ్ తెలిపారు. కట్నం తీసుకోకుండానే తాను పెళ్లి చేసుకున్నాని తన తల్లి విజయ నిర్మల ఆమెకు రూ.30 లక్షలు విలువైన ఆభరణాలను చేయించిందని చెప్పారు. అయితే, పెళ్లైన కొన్ని నెలలు నుంచే రమ్య తనను వేధించడాన్ని ప్రారంభించిందని తెలిపారు.
 
తనకు తెలియకుండా ఆమె చేసిన అప్పుల్లో రూ.10 లక్షల మేరకు తీర్చేశానని తెలిపారు. తమకు 2012లో రణవీర్‌ అనే కుమారుడు పుట్టాడని వెల్లడించాడు. ఇదిలావుంటే నరేష్ ప్రస్తుతం పవిత్ర లోకేశ్‌ సహజీవనం చెస్తున్న విషయం తెల్సిందే.