శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (17:17 IST)

సామాజిక అంశంతో అల్లరి నరేష్ ఉగ్రం

Naresh's Ugram
Naresh's Ugram
అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సామాజిక అంశంతో  ఉగ్రం రూపొందుతున్నది.
 
ఒక స్పెషల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఆ వీడియోలో నరేష్ బైక్ నడుపుతూ ఇంటెన్స్ గా కనిపించారు. బైక్‌ను ఆపి తుపాకీ తీసుకుని గట్టిగా అరుస్తూ ఎవరినో కాల్చాడం ఆసక్తికరంగా వుంది. వీడియో చివర్లో ఏప్రిల్ 14న విడుదల తేదీని ప్రకటించారు. నరేష్ తన తుపాకీని ఒకరిపై గురిపెట్టిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. వీడియో, పోస్టర్ నరేష్ పాత్ర యొక్క వైల్డ్ క్యారెక్టర్ ని తెలియజేస్తున్నాయి.
 
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. కొంతమంది ప్రముఖ నటీనటులు సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నాందికి పని చేసిన దాదాపు టెక్నికల్ టీం 'ఉగ్రం' కోసం పని చేస్తున్నారు.
 
తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్నారు . శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.