నటీనటులు: అల్లరి నరేష్-ఆనంది-సంపత్-వెన్నెల కిషోర్-శ్రీతేజ్-కుమనన్ సేతురామన్-రఘుబాబు-ప్రవీణ్ తదితరులు
సాంకేతికత: సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి, మాటలు: అబ్బూరి రవి, నిర్మాణం: రాజేష్ దండ-జీ స్టూడియోస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏఆర్ మోహన్
తెలుగు హీరో అల్లరి నరేష్, తమిళ దర్శకుడు ఏఆర్ మోహన్ చేసిన ప్రయత్నం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా. కామెడీతో నవ్వించిన అల్లరి నరేష్ ఇటీవల సీరియస్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటున్నాడు. 'నాంది' అనే సీరియస్ సినిమా చేస్తే మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు అదే వరుసలో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో తెలుసుకుందాం.
కథ:
శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఒక ప్రభుత్వ పాఠశాలతో తెలుగు ఉపాధ్యాయుడు. తెలుగును కించపరిస్తే సహించడు. అలాంటి శ్రీనివాస్ ను, డబల్ ఎం.ఏ. ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు వెన్నెల కిశోర్ ను మారేడుమిల్లి నియోజవర్గం ఎం. ఎల్. ఏ. ఎలక్షన్ లో ఓటు వేయించే బాధ్యత మీద మారేడుమిల్లి నియోజవర్గం కింద వచ్చే మారుమూల అటవీ ప్రాంతానికి పంపిస్తుంది అక్కడికి వెళ్లాక విద్య.. వైద్య.. రవాణా సౌకర్యాలు లేక ఆ ప్రాంత జనం పడుతున్న కష్టం శ్రీనివాస్ చాలించి పోతాడు. 30 ఏళ్లుగా తమ గోడు ప్రభుత్వ అధికారులకు, నాయకులకు ఎన్నికల్లో ఓటు వేయమని అక్కడి ప్రజలు తేల్చి చెపుతారు. అల్లాంటి వారిలో మార్పు తెచ్చే ఓటు వేయించడమే గాకా ప్రభుత్యం లోనూ చలనం తెప్పిస్తాడు. అది ఎలా అనేది. తేరా మీద చూడాల్సిందే..
విశ్లేషణ:
కథా బలం ఉన్న సినిమాలు, ప్రజల్ని చైతన్యం చేసే సినిమాలు బ్లాక్ అండ్ వైట్ నుంచీ వస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా మారుమూల గ్రామాల్లో ఆ ప్రభావం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది పీట్టింది ఇలాంటి ప్రజలకోసమే. కానీ పబ్లిక్ సర్వీస్ ఎగిరిపోయి కేవలం కమిషన్ మీద అధికారులు, పాలకులు ప్రజల్ని పీడిస్తున్నారు. ఈ పాయింట్ ఈ సినిమాలో హైలెట్. ఇంత కాలం ప్రలకోసమే ప్రజాసామ్యం అనేది రాతల్లోనే ఉంది. చేతల్లో లేదు. ప్రజల్ని పీడించి దోచుకోవడమే ప్రజాసామ్యం అనే అర్థం మారిపొయినది. ఇలాంటి టైంలో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'తో దర్శకుడిగా పరిచయం అయిన ఏఆర్ మోహన్ పెద్ద సాహసమే చేశాడు.
అభివృద్ధికి చాలా దూరంగా ఓ మారు మూల అటవీ ప్రాంతంలో ఉండే జనాలు.. తమ సమస్యల పోరాటం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి అండతో చేసే పోరాటం నేపథ్యంలో సినిమా తీశాడు. ఈ ప్లాట్ లైన్ చదవగానే ఇలాంటి సినిమాలు ఏం చూస్తాం.. ఈ రోజుల్లో ఇవేం నడుస్తాయి అనిపించొచ్చు. కానీ ఒక కాజ్ నేపథ్యంలో సాగే సినిమానే అయినా.. ఎన్నో పరిమితులు ఉన్నా.. కథనాన్ని వీలైనంత ఆసక్తికరంగా నడిపిస్తూ.. అక్కడక్కడా వినోదాన్ని కూడా జోడిస్తూ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రాన్ని జనరంజకంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రేక్షకులను ఈ చిత్రం సర్ప్రైజ్ చేయకపోవచ్చు కానీ.. రెండున్నర గంటల పాటు కుదురుగా కూర్చోబెట్టడంలో.. అక్కడక్కడా ఎంటర్టైన్ చేయడంలో.. ఎమోషనల్ గా కదిలించడంలో.. అన్నింటికీ మించి ఒక ఆలోచన రేకెత్తించడంలో విజయవంతం అయింది.
సినిమా మొదలైన తీరు చూసి ఇది మరీ సీరియస్ మూవీనేమో అని భయం కలిగినా.. వెన్నెల కిషోర్ రంగ ప్రవేశంతో వినోదం వస్తుంది. అతడికి ప్రవీణ్ కూడా తోడయ్యాక ఎంటర్టైన్ కనిపించింది. ఎన్నికల విషయంలో పూర్తి విముఖతతో ఉన్న జనాలను మోటివేట్ చేయడానికి హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ ముందుకు నడుస్తుంది. ఒక బలమైన.. హృద్యమైన ఘట్టంతో హీరో మీద అడవి బిడ్డల అభిప్రాయం మారుతుంది. అది ప్రేక్షకుల కళ్లను తడి చేస్తుంది. ఈ సినిమాలో ఆత్మ ఉందనే విషయం అప్పుడే అర్థమవుతుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక హీరో కిడ్నాప్ వ్యవహారంతో ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్టే ఇచ్చారు.
ఇక ద్వితీయార్ధంలో కిడ్నాప్ వెనుక అసలు కథ వెల్లడి కావడం.. ఆ తర్వాత హీరోను విడిపించడానికి ప్రభుత్వం చేేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్ టచ్ తో సాగాయి. కలెక్టర్ పాత్రలో మార్పు వచ్చేలా హృద్యంగా సాగే పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినీమియా టిక్ గా ఉన్న ప్రేక్షకులను అవి కదిలిస్తాయి. తెలుగు సినిమా హీరో అంటే సమస్యతో పాటు పరిష్కారం చాలా పెద్ద స్థాయిలో ఉండాలన్న మైండ్ సెట్ మనకు అలవాటైపోవడం వల్ల డిఫరెంట్ ఫీలింగ్ కలగొచ్చు.
అల్లరి నరేష్ కు 'నాంది' తర్వాత ఇందులో సిన్సియారిటీ కనిపించింది. వెన్నెల కిషోర్ ఈ సీరియస్ మూవీలో అక్కడక్కడా మంచి పంచులేస్తూ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రవీణ్ అతడికి సహకరించాడు. వ్యాపారం చేసే రఘుబాబు కూడా బాగానే ఎంటర్టైన్ చేశాడు. కలెక్టర్ పాత్రలో సంపత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోయిన్ ఆనంది కాస్త చదువుకున్న అటవీ ప్రాంత అమ్మాయిని మెప్పించింది. మిగిలిన పాత్రలు బాగానేచేశారు.
- శ్రీ చరణ్ పాకాల పాటలు.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఉన్న రెండు మూడు పాటలు సినిమాలో ఫ్లోలో బాగానే నడిచిపోయాయి. నేపథ్య సంగీతం కూడా హృద్యంగా సాగింది. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. ఎన్నో పరిమితుల మధ్య అడవిలో చిత్రీకరణ కోసం ఛాయాగ్రాహకుడు.. ఆర్ట్ డైరెక్టర్కష్టం కనిపించింది. అబ్బూరి రవి మాటలు చాలానే రాశారు. థియేటర్లో బాగా పేలాయి. దర్శకుడు ఏఆర్ మోహన్ ప్రతిభ కనపరిచాడు.
కేవలం వినోదం పేరుతో సినిమా తీయకుండా ప్రజా సమస్యలు, అధికారుల తీరు, రాజకీయ నాయకుల అవకాశవాదం వర్త మాన సమాజానికి ప్రతిరూపంగా ఉన్నాయి. అయితే ఇంకా స్వతంత్రం రాని పల్లెలేకాదు, పట్టణాలు కూడా మనం చూస్తున్నాము. ప్రజల్లో చెతన్యం తెచ్చే సినిమా ఇది.
రేటింగ్-2.75/5