బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (16:14 IST)

విడుదలకు సిద్ధంగా రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ తెలిసినవాళ్ళు

Ram Karthik, Hebba Patel,
Ram Karthik, Hebba Patel,
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం తెలిసినవాళ్ళు. సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో రూపొందుతోంది. విభిన్న కథాంశంతో రొమాన్స్, ఫ్యామిలీ,  థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్నది.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
 
ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన "శశివదనే" పాటకు మంచి స్పందన లభించింది. అలానే  ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.ఈ చిత్రం టీజర్ చూసిన తరువాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి, టీజర్ చూసిన కొంతమంది ప్రొడ్యూసర్స్, సినీ ప్రముఖులు నుంచి మంచి స్పందన లభిస్తుంది.  అలానే ఈ చిత్రంపై మంచి నమ్మకంతో ఉన్నారు. పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ అన్ని ఈ చిత్రంపై అంచనాలను పెంచుతున్నాయి.
 
ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, త్వరలో సెన్సార్ పనులు కూడా పూర్తిచేయనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనుంది చిత్రబృందం. "తెలిసినవాళ్ళు" చిత్రం మరిన్ని అప్డేట్స్ ను , ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసుకుందుకు సన్నాహాలు చేస్తున్నారు.