గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (12:51 IST)

"శాసనససభ"లో హెబ్బా పటేల్ స్టెప్పులు

hebba patel
తెలుగు చిత్రపరిశ్రమలోని కుర్రకారు హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. "కుమారి 21ఎఫ్" చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించారు. అయితే, "ఎక్కడికి పోతావు చిన్నవాడ" చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమెకు సరైన అవకాశాలు లేక బాగా వెనుకబడిపోయింది. 
 
అదేసమయంలో ప్రత్యేక గీతాల్లో నటించేందుకు జై కొడుతోంది. స్పెషల్ ఐటమ్ సాంగ్‌లు చేస్తూ ప్రేక్షకులకు చేరవు అవుతూ, తన క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో హీరో రామ్ నటించిన "రెడ్" చిత్రంలో ఆమె ఐటమ్ సాంగ్‌తో ఆలరించిన హెబ్బా పటేల్.. ఇపుడు మరోమారు అలాంటి పాటలో నర్తించేందుకు సిద్ధమయ్యారు. 
 
"శాసనసభ" అనే పాన్ ఇండియా మూవీలో ఆమె స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పేశారు. ఇంద్రసేన, ఐశ్వర్య రాజేష్‌లు జంటగా నటించే ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం హెబ్బా పటేల్‌‍ను ఎంపిక చేశారు. 
 
రవి బస్రూర్ సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి ఈ స్పెషల్ సాంగ్‌ను మంగ్లీతో పాటించారు. త్వరలోనే లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానుంది.