సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (20:52 IST)

కొత్తపేటలో 75 మీటర్ల పొడవున్న త్రివర్ణ పతాకంతో గూగీ ప్రోపర్టీస్ ర్యాలీ

Flag
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌లో భాగంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ గూగీ ప్రోపర్టీస్ ఉద్యోగులు, వారి అసోసియేట్స్ కొత్తపేట నుండి ఎల్‌.బి. నగర్ వరకు 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

 
National Flag
గూగీ ప్రోపర్టీస్ ఎం.డీ, సీ.ఈ. ఓ. శ్రీ షేక్ అక్బర్ కొత్తపేటలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో భారత జాతీయ జెండాను ఎగురవేశారు. తదుపరి కొత్తపేట నుండి ఎల్.బి.నగర్ వరకు 75 మీటర్ల త్రివర్ణ పతాక ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ వేడుకల్లో 250 మందికి పైగా సిబ్బంది, సహచరులు పాల్గొన్నారు.