బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (13:05 IST)

పవిత్ర లోకేష్‌కి నరేష్ లిప్ లాక్.. పెళ్లిని ధ్రువీకరించారు.. వైరల్ వీడియో

Pavithra Naresh
Pavithra Naresh
టాలీవుడ్‌లో ఇన్నాళ్ల పాటు చర్చనీయాంశమైన నటుడు నరేష్ పవిత్ర లోకేష్‌ వ్యవహారానికి ఎండ్ కార్డు పడింది. నటుడు నరేష్, పవిత్ర లోకేష్ తమ పెళ్లిని ఖాయం చేశారు. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ధ్రువీకరించారు. నటుడు నరేష్, పవిత్రా లోకేష్ గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. 
 
తాజాగా వారు అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా, నరేష్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వారి వివాహ వార్తలను ప్రకటిస్తూ వీడియోను పంచుకున్నారు. వీడియోలో నరేష్, పవిత్ర కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు.
 
నరేష్ పవిత్రకు లిప్ లాక్ ఇచ్చాడు. వారి చేతిలో డ్రింక్ ఉన్న గ్లాస్ పట్టుకున్నారు. అనంతరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. "కొత్త సంవత్సరం... కొత్త ప్రారంభం... మీ అందరి ఆశీస్సులు కావాలి... మా నుండి మీ అందరికీ  హ్యాపీ న్యూ ఇయర్... మీ పవిత్ర నరేష్" అని తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.