మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (18:11 IST)

అజయ్ దేవగణ్ కూతురు నైసాకు ఏమైంది.. ఇలా తప్పతాగి..?

Nysa
Nysa
బాలీవుడ్ స్టార్ నటుల పిల్లలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అజయ్ దేవగణ్ కూతురు నైసా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. అజయ్‌ దేవగణ్‌ కూతురు నైసా దేవగణ్ తన ఫ్రెండ్‌ ఓర్హాన్‌ అవత్రమణితో ముంబైలో పార్టీకి వెళ్లిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఎందుకంటే వారిద్దరూ వీడియోలో తప్పతాగి కనిపించారు. 
 
ఈ వీడియోపై ట్రోలింగ్ మొదలైంది. ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్, ఇతర స్టార్‌కిడ్‌లు కూడా పార్టీలో కనిపించడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నైసా, ఓర్రీ చేతులు పట్టుకుని నడుస్తున్న ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 
వారిద్దరూ తప్పతాగి వున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే.. వారి పిల్లలు మస్తుగా జల్సా చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. నైసా దేవగణ్.. అజయ్, కాజోల్‌లకు మొదటి సంతానం. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ వున్నాడు.