ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (22:45 IST)

అసత్య వార్తలను నమ్మొద్దు.. మా అన్న బాగున్నారు.. శరత్ బాబు సోదరి

sarathbabu
ప్రముఖ నటుుడు శరత్ బాబు ఆరోగ్యంగా బాగున్నారని, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని శరత్ బాబు సోదరి విజ్ఞప్తి చేశారు. శరత్ బాబు మృతి చెందారంటూ సాగిన ప్రచారంపై ఆమె స్పందించారు. 
 
శరత్ బాబు మునుపటి కంటే కొంచెం కోలుకున్నారని, ఐసీయు నుంచి రూమ్‌కు షిఫ్ట్ చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని కోరారు. త్వరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకుని మీడియాతో మాట్లాడుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, స్వగ్రామంలో ఉన్న శరత్ బాబు సోదరుడు కూడా తమ అన్న చనిపోలేదని మీడియాకు వెల్లడించారు. శరత్ బాబు వెంటిలేటర్‍‌పై చికిత్స కొనసాగుతోందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపారు.