మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మే 2023 (16:51 IST)

వర్షం నుంచి సోదరిని కాపాడిన సోదరుడు.. వీడియో వైరల్

rain
వర్షం నుంచి తన తోబుట్టువును కాపాడేందుకు అతడి రక్షించే సోదరుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం 12 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను సీసీటీవీ ఇడియట్స్ అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
 
క్లిప్‌లో, భారీ వర్షం పడుతుండగా, తన చెల్లెలిని తన టీషర్ట్‌లో దాచిపెట్టి.. వర్షం నుంచి కాపాడేందుకు తన చేతుల్లో ఎత్తుకుని వెళ్లడం ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. 
 
అబ్బాయి కారులో కూర్చున్నప్పుడు తన సోదరి జుట్టును ప్రేమగా సరిచేయడాన్ని చూడవచ్చు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి వేలకొద్ది లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.