ఢిల్లీ మెట్రో రైలులో మళ్లీ అదే తీరు.. షేప్ పాటకు స్టెప్పులు
Delhi Metro
రైల్వే కోచ్‌ల్లో ఇలాంటి వీడియోలను తీసేందుకు అనుమతి లేదని తెలిసినా పలువురు ఇలాంటి వీడియోలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ మహిళ పంజాూబీ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎర్రటి టాప్- గ్రే ప్లీటెడ్ స్కర్ట్ ధరించి 'షేప్' పాటకు డ్యాన్స్ చేస్తున్న మహిళను వీడయోలో చూడవచ్చు. యూజర్ itz_officialroy ద్వారా ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
అయితే, మెట్రో లోపల ఎవరైనా డ్యాన్స్ చేయడంపై విమర్శలు రావడం ఇదే తొలిసారి కాదన్న విషయం తెలిసిందే.
