శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

వరంగల్‌లో దారుణం - అర్థరాత్రి ఆటోలో వివాహితపై సామూహిక అత్యాచారం

rape
వరంగల్‌లో దారుణం జరిగింది. అర్థరాత్రి ఆటోలో వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు ఆటో ఎక్కగానే ఆటో డ్రైవర్ తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వారు రాగానే ఆటోను భీమారం వైపు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనుమానంతో అరిస్తే నిందితులను భయపెట్టాడు. ఆపై అత్యాచారం చేసి ఆమె చెప్పిన చోట వదిలేసి పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హనుమకొండ నయీం నగర్‌కు సమీపంలో నివసించే వివాహిత ఈ నెల 27వ పనిపై బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో తిరిగిత ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో కేయూ క్రాస్ వద్ద ఆటోను ఆపి రంగ్‌బార్ వద్ద దింపాలని కోరింది. సరేనని ఆమెను ఎక్కించుకున్న డ్రైవర్, రాకేశ్ తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్, సతీశ్‌కు ఫోన్ చేశాడు. వారొచ్చి ఆటో ఎక్కగానే ఆటోను ముందుకుపోనిచ్చాడు. అయితే, ఆటో ఆమె చెప్పిన చోటుకు రాకుండా భీమారం వైపు వెళ్తుండటంతో అనుమానం వచ్చిన ఆమె ప్రశ్నించి అరవడంతో రాకేశ్ స్నేహితులు ఆమె బెదిరించారు.
 
ఆ తర్వాత ఆటోలోని సౌండ్ బాక్స్‌ సౌండ్ పెంచి ఆటోలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె చెప్పిన రంగ్‌బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకో చెప్పడంతో అందరూ కలిసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.