సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (20:33 IST)

భర్తతో జగడం.. కారు నుంచి బయటికి దిగింది.. అంతే పెద్దపులి ఎత్తుకుపోయింది.. (video)

Car
Car
 
 
కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ పులి దాడికి గురై ప్రాణాలు కోల్పోయింది. కారులోనే భర్తతో గొడవపడి.. కారునుంచి దిగి భర్తతో వాగ్వివాదానికి దిగిన మహిళను వెనక నుంచి వచ్చిన భారీ పులి దాడి చేసి హతమార్చింది. ఈ ట్విట్టర్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 
 
అమెరికాలోని సఫారీ పార్క్‌లో తన భర్తతో వాదనలో ఉన్న సమయంలో మహిళ కారు నుండి కిందకు దిగింది. ఆ వీడియోలో కారు ఆగి వుంది. డ్రైవర్ సీటులో వున్న ఆమె భర్త తలుపులు తెరిచి ఆమెను కారులోకి రావాల్సిందిగా కోరాడు. అయినా ఆమె కారు ఎక్కలేదు.
 
ఇంతలో ఓ పెద్దపులి ఆమెను వెనక నుంచి లాక్కెళ్లింది. ఆమెను రక్షించేందుకు భర్త పరుగులు తీశాడు. అయినా లాభం లేకపోయింది. ఈ ఘటనలో మహిళ తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియోకు 2.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 2.5 రీట్వీట్లు వచ్చాయి. 20,000 పైగా లైక్‌లు వచ్చాయి.