ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (19:44 IST)

కన్ఫామ్... బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్?

tamannah - vijay varma
చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన హీరోయిన్ తమన్నా.. ఇపుడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగే చేస్తున్నట్టు సాగుతున్న ప్రచారం నిజమని తేలింది. తాజాగా వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కారు. డ్రైవర్ సీటులో విజయ్ వర్మ, ఆ పక్క సీటులో తమన్నా కూర్చొనివుండగా, కెమెరాకు చిక్కారు. 
 
నిజానికి విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. కొత్త సంవత్సర వేడుక సందర్భంగా వీరిద్దరూ ముద్దు పెట్టుకున్న వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా వీరిద్దరూ మీడియా కంటపడింది. 
 
ముంబైలో వీరిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్‌లో డిన్నర్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లిపోయారు. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం తమన్నా చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "భోళాశంకర్" కూడా అందులో ఒకటి.