గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 23 ఫిబ్రవరి 2023 (19:25 IST)

మింత్ర ఫ్యాషన్ ఎంపికల పట్ల తమన్నా భాటియా, విజయ్ దేవరకొండ విస్మయం

Tamannah-Vijay Devarakonda
మింత్రా తన తాజా బ్రాండ్ క్యాంపెయిన్ ‘ప్రతిరోజూ అసాధారణంగా కనిపించండి’లో భాగంగా తన బ్రాండ్ అంబాసిడర్‌లు తమన్నా భాటియా, విజయ్ దేవరకొండలతో వరుస యాడ్ ఫిల్మ్‌లను విడుదల చేసింది. మహిళల వెస్ట్రన్ వేర్, ఎత్నిక్ వేర్‌లను తమన్నా భాటియా ప్రమోట్ చేసే రెండు వాణిజ్య చిత్రాలలో, విజయ్ దేవరకొండ పురుషుల క్యాజువల్ వేర్‌లను ప్రమోట్ చేసే ఒక యాడ్ ఫిలింలో కనిపించారు. దేశం నలుమూలల ఉన్న వారి లక్షలాది మంది అభిమానులను ఆకర్షించేలా ఫ్యాషన్ కథనాన్ని మిత్రా సమిష్టిగా రూపొందించింది.
 
మింత్రా తన వినియోగదారులకు 6000 ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ మరియు డీ2సీ బ్రాండ్‌ల విస్తృత ఎంపికల నుంచి ఉత్తమమైన ఫ్యాషన్, బ్యూటీ మరియు జీవనశైలిని ఉత్పత్తులను విస్తృత శ్రేణి ధరల వద్ద 17 లక్షల ట్రెండ్-ఫస్ట్ స్టైల్‌లను అందిస్తోంది. బ్రాండ్ క్యాంపెయిన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి వినియోగదారుని కోసం మింత్రా ప్రత్యేకమైన ఆఫర్‌ను హైలైట్ చేయడం, వారి రోజువారీ ఫ్యాషన్ అవసరాలను తీర్చడం ద్వారా దేశంలోని రోజువారీ ఫ్యాషన్‌ను ఉన్నతీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
“ప్రతిరోజు అసాధారణంగా ఉండండి” అనే ప్రధాన ఆలోచనతో కూడిన వాగ్దానానికి అనుగుణంగా రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్ తన వినియోగదారులు కోరుకునే ఇష్టమైన అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్‌ల విస్తృత శ్రేణి నుంచి ఉత్పత్తులను ఎంచుకునేందుకు అనుమతిస్తుంది. ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన సరికొత్త స్టైల్‌లు,  ట్రెండ్‌ల విస్తృత శ్రేణికి సులభమైన అందుబాటుతో, వారి రోజువారీ స్టైల్ కొత్త శిఖరాలను చేరుకుంటుంది. దీనితోనే సాధారణ క్షణాలను అసాధారణంగా చేయడంలో సహాయపడుతుందనే ఇన్‌సైట్‌ల నుంచి ఈ ఆలోచన వచ్చింది.