విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు క్షమాపణలు తెలిపిన సమంత
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఖుషి' చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ మయాసైటిస్ కారణంగా ఆగిపోయింది.
ఈ సందర్భంలో సమంత ఆరోగ్యం మెరుగై మళ్లీ సినిమాపై దృష్టి పెట్టడంతో త్వరలో ఖుషీ షూటింగ్ లో జాయిన్ కానుందని అంటున్నారు.
సమంత ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇంతలో, ఖుషీ ఆలస్యం అయినందుకు విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెబుతూ సమంత ట్వీట్ చేసింది.
"విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు నా క్షమాపణలు. ఖుషి చిత్రీకరణ త్వరలోనే ప్రారంభమవుతుంది" అని సమంత తెలిపింది. అలాగే సమంత ట్వీట్‌కు విజయ్ దేవర కొండ రిప్లై ఇచ్చారు. "నువ్వు పూర్తిగా కోలుకోని నవ్వులు చిందిస్తూ వచ్చే వరకు మేం అందరం వేచి చూస్తాం" అని చెప్పారు.