1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (18:14 IST)

రేస్‌ కార్‌ను డ్రైవ్ చేసిన సచిన్‌ టెండూల్కర్‌, రామ్‌చరణ్‌

suchin- ramcharan
suchin- ramcharan
ఈరోజు హైదరాబాద్‌లోని  ఫార్ములాలో జరిగిన మహీంద్రా రేసింగ్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు.ఇది యావత్ దేశానికి, రాష్ట్రానికి, నగరానికి గర్వకారణమని పేర్కొన్నారు.
 
Charan car drive
Charan car drive
ప్రస్తుతం హైదరాబాద్‌లో కార్‌ రేస్‌ జరుగుతోంది. ఆదివారంనాడు వీటిని తిలకించేందుకు ప్రముఖులు హైదరాబాద్‌లో దిగారు. క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, రామ్‌చరణ్‌ లు ఇద్దరూ ఈరోజు కార్‌రేస్‌ గురించి జరిగిన మీట్‌లో పాల్గొన్నారు. అక్కడ మహేంద్ర కంపెనీకి చెందిన టీమ్‌ వారికి పూర్తి వివరాలు తెలియజేశాయి. పదేళ్ళ తర్వాత మోటార్‌ స్పోర్ట్‌ ఈవెంట్‌ ఇక్కడ జరగబోతుంది.
 
Charan at car race place
Charan at car race place
ఈ ఈవెంట్‌లో పలుదేశాలకు చెందిన 11 టీమ్‌లు, 22 మంది డ్రైవర్స్‌ పాల్గొననున్నారు. ఇప్పటికే ట్యాంక్‌ బండ్‌ చుట్టుప్రక్కల అన్ని రోడ్లను పోలీసులు బ్లాక్‌ చేశారు. తెలుగు తల్లి ఫ్లయిఓవర్‌ను మూసివేశారు.

Ca race preseemet
Ca race preseemet
ఇక ప్రధాన పాయింట్‌ ఐమాక్స్‌ థియేటర్‌ దగ్గర కారు రేసు తిలకించేందుకు సిటింగ్‌ గ్యాలరీని విదేశీయుల పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. అక్కడ కుర్చీలకు బ్లూ కలర్‌ వేయడం విశేషం. దీని ప్రభావం ఐమాక్స్‌ థియేటర్‌ పై పడింది.