హైదరాబాదులో ఈ-రేసింగ్- ఆనంద్ మహీంద్రా-కేటీఆర్-చెర్రీ కలిసి..?
హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో జరిగిన ఈ-రేసింగ్ జనరేషన్ మూడో సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు రామ్ చరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం వచ్చింది. ఆనంద్ మహీంద్రా- కేటీఆర్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో చిత్రాన్ని పోస్ట్ చేశారు.
ఈ ఫోటో కాస్త అది వైరల్ అయ్యింది. తన క్యాప్షన్‌లో, రామ్ చరణ్ ఇద్దరు నాయకులను కలుసుకున్నందుకు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ఫార్ములా ఇ-రేసింగ్‌లో ఆనంద్ మహీంద్రా ప్రమేయాన్ని ప్రశంసించాడు.