గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (17:13 IST)

కియారా - సిద్ధార్థ్ మల్హోత్రాకు క్షమాపణలు చెప్పిన ఉపాసన.. ఎందుకు?

Kiara and Siddharth
దక్షిణాది సూపర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొత్త పెళ్లి జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలకు క్షమాపణలు తెలిపారు. ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా తమ వివాహానికి హాజరు కానందుకు ఉపాసన దంపతులకు క్షమాపణలు చెప్పారు. 
 
కియారా-సిద్ధార్థ్ లకు అభినందనలు. క్షమించండి.. మీ పెళ్లికి మేము హాజరు కాలేకపోయాము అంటూ తెలిపారు. కియారా -సిద్ధార్థ్ ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లోని సూర్యాగ్రహ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు.
 
కియారా పింక్ లెహంగాలో ప్రతి అంగుళం అందంగా కనిపించింది. సిద్ధార్థ్ దానికి సరిపోయే తలపాగాతో కూడిన ఐవరీ షేర్వాణిని ధరించాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ త్వరలో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన రాబోయే సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌తో తన వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టనున్నాడు.