బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (11:47 IST)

జో బైడన్‌ భార్య- కమలా హ్యారిస్‌ భర్త పబ్లిక్‌గా లిప్ కిస్

Joe Biden
Joe Biden
అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ భార్య, ప్రథమ పౌరురాలైన జిల్‌ బైడెన్‌.. ఆ దేశ ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్‌ భర్త డౌ ఎమ్హోఫ్ పబ్లిక్‌గా లిప్ కిస్ ఇచ్చుకున్నారు. 
 
ఈ వీడియో ఇంటర్నెట్‌లో కలకలం రేపింది. ప్రెసిడెంట్ బిడెన్ తన రెండవ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేస్తున్నప్పుడు వందలాది మంది కాంగ్రెస్ ప్రతినిధుల ముందు ఈ సన్నివేశం జరిగింది.
 
ఇది యూస్ ప్రతినిధుల సభలో మెజారిటీని కోల్పోయిన తర్వాత అతని మొదటిదిగా గుర్తించబడింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఈ సన్నివేశంపై  మీమ్స్, జోక్‌లు పేలుతున్నాయి. ఇలా జో-బైడన్ భార్య.. కమలా హారిస్ భర్తను ముద్దాడటం ప్రస్తుతం యూఎస్ హౌస్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
కాగా కమలా హ్యారిస్ ను మరోమారు ఉపాధ్యక్ష రేసులో నిలపకూడదని బైడెన్ భావిస్తున్నట్లు లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ కథనం తెలిపింది.