బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (09:32 IST)

భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిన పాపం.. భర్తే చంపేశాడు..

crime scene
భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయిన భార్యపై కక్ష తీర్చుకున్నాడు భర్త. రెక్కీ నిర్వహించి మరీ ఆమెను అంతమొందించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
నగరానికి చెందిన కరీనా బేగం (30), మహ్మద్ యూసుఫ్‌లకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే పెళ్లయిన తర్వాత వేధింపులు అధికం కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.  ఈ క్రమంలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరింది. 
 
మరోవైపు, భార్య ఇంటికి రావడం లేదన్న కోపంతో ఉన్న భర్త యూసుఫ్.. వారం రోజులుగా ఆమె కదలికలను గమనిస్తూ వస్తున్నాడు. శుక్రవారం స్కూలుకు వెళ్లేందుకు కరీనా ఇంటి నుంచి బయల్దేరింది. సమయం కోసమే ఎదురుచూస్తున్న యూసుఫ్.. ఆమెకు ఎదురెళ్లి మాట్లాడుతున్నట్టు నటించాడు. 
 
అలా కొంతదూరం నడుస్తూ ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న రాడ్డుతో భార్య తలపై బలంగా బాదాడు. అంతే.. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు