బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (08:16 IST)

బైకుపై ప్రేమజంట రొమాన్స్.. కటకటాల వెనక్కి నెట్టిన ఖాకీలు.. ఎక్కడ?

lovers romance on bike
బైకుపై ఓ ప్రేమ జంట రొమాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రేమజంటను గుర్తించి అరెస్టు చేసి కటకటాలవెనక్కి పంపించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో వెలుగు చూసింది.
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన ప్రియురాలిని తన బైక్ పెట్రోల్ ట్యాంకుపై తనకు ఎదురుగా కూర్చోబెట్టుకుని రొమాన్స్ చేస్తూ బైక్ నడిపాడు. వీనిని చూసిన ఇతర వాహనదారులు షాకయ్యారు. ఆ తర్వాత తేరుకుని వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. 
 
దీంతో అజ్మీర్ పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు.. బైకు నంబర్ ఆధారంగా ఆ ప్రేమజంటను అరెస్టు చేసింది. బైకుపై వికృత చేష్టలకు పాల్పడినందుకు వీలుగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, బైకును కూడా సీజ్ చేశారు. కాగా, గతంలో విశాఖపట్టణం, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, చత్తీస్‌గఢ్‌లో భిలాయ్‌‍లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి.