బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (12:36 IST)

విశాఖ ఆర్కే బీచ్‌లో అర్థనగ్నంగా యువతి మృతదేహం

swathi vaizag
విశాఖపట్టణం సముద్రతీరంలోని ఆర్కే బీచ్‌లో ఓ దారుణం జరిగింది. ఓ యువతి అనామానాస్పదంగా మృతి చెందింది. ఈ యువతి మృతదేహం అర్థనంగా కనిపించడంతో ఆ ప్రాంతంలో విహారానికి వెళ్లిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ మృతదేహాం తీరు చూస్తే అనేక అనుమానాలకు తావిస్తుంది. మృతదేహం మాత్రం1 ఇసుకలో కూరుకునిపోగా, కేవలం మృతదేహం మాత్రం బయటకు కనిపించింది. సమాచారం అందుకున్న ఆర్కే బీచ్ పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అన్నది అంతుపట్టడంలేదు. 
 
మృతురాలిని గాజువాక నడుపూరికి చెందిన స్వాతిగా గుర్తించారు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయువతి.. రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా, ఆర్కే బీచ్‌లో ఒక మృతదేహం ఉన్నట్టు సమాచారం అందుకుని అక్కడకు వెళ్లి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మృతదేహంపై ఉన్న పలు గాయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.