ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

బ్యూటీపార్లర్‌కు వెళ్లొద్దన్న భర్త... ప్రాణాలు తీసుకున్న భార్య

suicide
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 34 యేళ్ల వివాహిత క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. బ్యూటీపార్లర్‌కు భర్త వెళ్లొద్దని చెప్పినందుకు ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఇండోర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బల్‌రాం యాదవ్‌, రీనా దంపతులు ఏరోడ్రమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నారు. గురువారం రీనా బ్యూటీపార్లర్‌కు వెళ్తానని భర్తను కోరింది. అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో మనోవేదనకు గురైన రీనా ఆత్మహత్య చేసుకుంది. ఇంటిలోనే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.