గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (10:48 IST)

ఇండోర్ శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Well
Well
ఇండోర్ శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 34 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురి పరిస్థితి విషమంగా వుంది. పురాతన మెట్ల బావిపై పదేళ్ల క్రితం స్లాబ్ వేసి ఓ గదిని నిర్మించారు. 
 
సీతారాముల హోమం చేస్తుండగా ఎక్కువమంది ఆ స్లాబ్‌పై కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. బరువును భరించలేక కుంగిపోయింది. దీంతో చాలామంది బావిలో పడిపోయారు. ఈ ఘటనతో మెట్టబావిలోని నీటిని మోటారు నుంచి తొలగించారు. 
 
ఇండోర్‌ ఇన్సిడెంట్‌పై ఎంక్వైరీకి ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. బావిలో పడిన భక్తులను వెలికితీసేందుకు ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 40 అడుగుల లోతున్న మెట్ల బావిలో పడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు 18 మంది క్షతగాత్రులను ఒక్కొక్కరుగా బయటకు తీశారు.