సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (16:35 IST)

ఆదిపురుష్ కోసం వైష్ణో దేవిని దర్శించిన భూషణ్ కుమార్, ఓమ్‌రౌత్

Bhushan Kumar, Omraut
Bhushan Kumar, Omraut
ప్రభాస్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పలు అడ్డంకులు మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ సారి సెట్ కూడా కాలి పోయింది. ఆ తర్వాత కరోనా వళ్ళ పలు సార్లు షూటింగ్ వాయిదాల మధ్య జరిగింది. ఏదిఏమైనా అమ్మ ఆశీర్వాదం ఉండాలని నేడు జమ్మూలోని వైష్ణో దేవిని  నిర్మాత భూషణ్ కుమార్,  దర్శకుడు ఓమ్‌రౌత్ దర్శించుకున్నారు. 
 
ఈ ఫోటోను వారు పోస్ట్ చేశారు. జమ్మూలోని ఎత్తైన కొండపైకి గాడిదలపై వెళ్లి అక్కడ దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈరోజు  మంగళకరంగా భావిస్తున్నామని తెలిపారు. 
 
ఇప్పటికే షూటింగ్ పార్టీ ముగింపు దశకు చేరుకుంది. గ్రాఫిక్ పనులు దేశంలోనూ, విదేశాల్లోనే ఏకకాలంలో జరుగుతున్నాయి. ఆదిపురుష్ చిత్రం జూన్ 16, 2023న 3Dలో థియేటర్‌లలో విడుదల అవుతుంది. కృతిసనన్ నాయిక. సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు.