గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (10:35 IST)

జమ్మూకాశ్మీర్‌ కత్రాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

earthquake
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 3.6గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 
 
రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కత్రాకు 97 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది. 
 
కాగా, ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపాల వల్ల దాదాపు 40 వేల మందికి వరకు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. ఈ భూకంపాల నుంచి ఆ దేశాలు ఇంకా కోలుకోలేదు. పైగా, భారత్ వంటి దేశాలు టర్కీకి తన వంతు సాయం చేస్తుంది.