శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (10:23 IST)

టర్కీలో మరోమారు భూకంపం - వణకిపోతున్న పౌరులు

turkey earthquake
వారం రోజుల క్రితం సంభించిన భూకంపం కారణంగా టర్కీ, సిరియా దేశాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య  30 వేలకు పైమాటగానే ఉంది. ముఖ్యంగా, టర్కీలో పరిస్థితి మరింత భయానకరంగా ఉంది. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 
 
ఇక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా టర్కీలో మరోమారు భూకంపం సంభవించింది. ఆదివారం టర్కీలోని దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో 4.7 తీవ్రతతో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, దీనివల్ల పెద్దగా  ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. 
 
మరోవైపు, టర్కీ, సిరియా దేశాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 34,179 మంది చనిపోయారు. ఇందులో ఒక్క టర్కీలోనే 29605 మంది చనిపోయారు. సిరియాలో 1574 మంది మృత్యువాతపడ్డారు. భవన శిథిలాలను తొలగించే గకొద్దీ మృతదేహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 
 
అయితే, భూకంప మృతుల సంఖ్య 50 వేలకు పైగా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, టర్కీ, సిరియా దేశాల్లో సహాయక చర్యలు చేపట్టడంలోనూ, సాయం అందించడంలోనూ ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.