గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 మార్చి 2023 (23:20 IST)

ఇండోర్ ఇలా వుందంటే అభయ్ జీ కారణం, ఆయన సహకారం మరపురానిది: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

CM Sivaraj
అభయ్ ఛజ్లానీ జీ సంపాదకులు, రచయిత, సామాజిక సేవకుడు, మంచి మనిషి. ఇండోర్ ప్రస్తుతం ఇంత వైభవంగా వుందంటే దీని వెనుక ఆయన కృషి ఎంతో వుంది. మఖన్‌లాల్‌లోని ఎంపీ నగర్‌లోని వికాస్ భవన్‌లో ఏర్పాటు చేసిన నివాళి సమావేశంలో నయీదునియా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ శ్రీ అభయ్ ఛజ్లానీ జీ, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వేదప్రతాప్ వైదిక్ జీ స్మారకార్థం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై విషయాలు చెప్పారు. 
 
నివాళి సభలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హిందీ జర్నలిజం రంగంలో అభయ్ జీ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. అభయ్ గొప్ప పాత్రికేయుడు, సంపాదకుడు, సామాజిక కార్యకర్త అని అన్నారు. ఆయన నిష్క్రమణతో జర్నలిజం ప్రపంచానికి తీరని లోటు, ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాను అని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.