బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (19:22 IST)

ఐదేళ్ల బాలుడికి కానిస్టేబుల్ ఉద్యోగం.. ఎలా సాధ్యం!

child constable
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఐదేళ్ల బాలుడికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఇదెలా సాధ్యమనే కదా మీ సందేహం. ఆ బుడతుడు తండ్రి ఓ కానిస్టేబుల్ ఆయన విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తండ్రి ఉద్యోగం కుమారుడికి ఇచ్చారు. చైల్డ్ కానిస్టేబుల్‌గా ఎంపిక చేశారు. ఫలితంగా ఐదేళ్ల వయసులోనే కానిస్టేబుల్ అయ్యాడు. 
 
ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లాకు చెందిన నమాన్ రాజ్‌వాడే అనే ఐదేళ్ళ బాలుడు ప్రస్తుతం స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆయన తండ్రి రాజ్ కుమార్ రాజ్‌వాడే కొన్నేళ్లుగా జిల్లాలోని ఓ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేశాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కారుణ్య నియామకం కింద ఆ బాలుడికి ఈ ఉద్యోగం ఇస్తూ సర్గుజా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భావనా గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. 
 
దీనిపై ఆ బాలుడి తల్లి మాట్లాడుతూ, నా భర్త కొద్ది రోజుల క్రితం ప్రమాదంలో చనిపోయాడు. ఆయన స్థానంలోనా కుమారుడిని చైల్డ్ కానిస్టేబుల్‌గా నియమించారు. కొంచెం బాధగా ఉంది. కానీ, నా బిడ్డ పోలీస్‌గా మారబోతున్నందుకు సంతోషంగా కూడా ఉంది అని చెప్పింది.