శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (10:06 IST)

ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.. భార్యపై యాసిడ్ దాడి

ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అది కూడా న్యాయస్థానం ప్రాంగణంలోనే ఇది జరిగింది. తమిళనాడులోని కోవైలో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు 2016లో జరిగిన ఓ చోరీ కేసులో నిందితురాలు. ప్రస్తుతం బెయిల్‌పై బయట వున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం గురువారం జిల్లా న్యాయస్థానానికి వచ్చారు. 
 
కోర్టుకు వస్తుందని ముందే ఊహించిన ఆమె భర్త శివకుమార్ పక్కా ప్లాన్ ప్రకారం నీళ్ల సీసాలో యాసిడ్ తీసుకొచ్చాడు. ఆమె కనిపించగానే.. ఒక్కసారిగా ముఖంపై యాసిడ్ పోశాడు. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. 
 
ఈ దాడిలో ఆమె మెడ కింద తీవ్రంగా కాలిపోయింది. అక్కడున్నవారు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే 80 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం శివకుమార్ కోర్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.