మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (17:37 IST)

మహిళ పడకగదిలో ఆరు అడుగుల పాము..

Snake
Snake
సాధారణంగా పాములు ఇంటిలోనికి ప్రవేశించడానికి సంబంధించిన ఘటనలు చాలానే వున్నాయి. అయితే తాజాగా ఓ మహిళ పడకగదిలోకి ఆరు అడుగుల పాము ప్రవేశించింది. అంతే ఆమెకు గుండె ఆగినట్లైంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఒక మహిళ తన మంచంలో 6 అడుగుల విషపూరితమైన పామును పొంచి ఉన్నట్లు గుర్తించి జడుసుకుంది. 
 
సోమవారం నాడు సదరు మహిళ తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బెడ్‌పై ఉన్న షీట్లను మార్చుకోగా దుప్పట్ల కింద నుంచి అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. వెంటనే తలుపులు మూసేసింది. పాము తన ఇంట్లో నుంచి బయటికి రానీయకుండా అన్నీ సిద్ధం చేసింది. 
 
ఆపై పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసింది. పాములు పట్టే వ్యక్తి రానే వచ్చాడు. మంచంపై వున్న ఆరు అడుగుల పామును పట్టుకెళ్లాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.