ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-03-2023 శుక్రవారం మీ రాశిఫలాలు - దుర్గా అమ్మవారిని పూజించిన...

Pisces
మేషం :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. నిజాయితీగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలు టి.వి వంటి విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు.
 
వృషభం :- స్త్రీలకు షాపింగు‌లోనూ, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పాత మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. మార్కెట్ రంగాల వారికి లాభదాయకమైన అవకాశం కలిసివస్తుంది. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
మిథునం :- మీ పై మిత్రుల వ్యాఖ్యల ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రయత్న పూర్వకంగా ఒక అవకాశం కలిసివస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదని గమనించండి. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది.
 
కర్కాటకం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థుల్లో రేపటి గురించి ఆందోళన అధికమవుతుంది. మీ సేవలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు ఆకస్మి ధనప్రాప్తి, వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణమాలుంటాయి.
 
సింహం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. కొన్ని సార్లు తక్కువ వారి నుంచి సహాయం పొందవలసివస్తుంది. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. క్రీడా, కళ రంగాల్లో వారికి సంతృప్తికానరాదు.
 
కన్య :- ఉపాధ్యాయులకు చికాకులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించటం క్షేమదాయకం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
తుల :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రీమతి లేక శ్రీవారి ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలడు. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి.
 
వృశ్చికం :- బ్యాంకు పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంఘంలో గౌరవం కన్నా అవమానాలను ఎదుర్కొంటారు. విద్యార్థినుల్లో మానసిక ధైర్యం నెలకొంటుంది. ఆకస్మిక నిర్ణయాలు, హామీల విషయంలో పునరాలోచన అవసరం. వాహనం ఇతరులకు ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాల నిస్తాయి. భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ప్రైవేటు, రిప్రజెంటివ్ సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు వాయిదా పడతాయి.
 
మకరం :- వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకోవటంతో పాటు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు అధికంగా ఉన్నా ధనానికి కొదువ ఉండదు. మీ అలవాట్లు, బలహీనతల వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులకు ఆకస్మికంగా చక్కని అవకాశం లభిస్తుంది.
 
కుంభం :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదోగ్యరీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ, ఏకాగ్రత అవసరం. ఖర్చులు పెరిగినా అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటుకాగలదు.
 
మీనం :- ఒక నష్టాన్ని మరొక విధంగా పూడ్చు కుంటారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రతముఖ్యం. సినిమా, సాంస్కృతిక రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకుల కలిగిస్తుంది.