సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-03-2023 తేదీ మంగళవారం దినఫలాలు - లక్ష్మీకుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి...

Sagitarus
మేషం :- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో నిలదొక్కుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఉద్యోగ యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది.
 
వృషభం :- ఆదాయ వ్యాయాలకు పొంతన ఉండదు. స్త్రీల అభిప్రాయాలకు ఏ మాత్రం స్పందన ఉండదు. ఫ్యాన్సీ, కిరణా, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ముక్కుసూటిగాపోయే మీ తత్వం వివాదాలకు దారితీస్తుంది. అనుకున్న పనులు ఆలస్యంగానైనా ఆశించిన విధంగా పూర్తి చేస్తారు. 
 
మిథునం :- వృత్తి వ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమల వారికి మిశ్రమ ఫలితం. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. ఉపాధ్యాయులకు బదిలీ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ఖర్చులు రాబడికి తగినట్లే ఉండటంతో ఇబ్బందులంతగా ఉండవు. 
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. పంతాలకు పోకుండా లౌక్యంగా మీ పనులు చక్కపెట్టుకోవలసి ఉంటుంది. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించటం మంచది కాదని గమనించండి. కాలానుగుణంగా మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు తోటివారితో సంయమనంతో మెలగవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. ఊహించని ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరుగుతాయి. భాగస్వామిక సమావేశాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలోవారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
కన్య :- ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. పూర్తిగాకాక కొంత ధన సహాయం చేసి బంధుత్వం నిలుపుకొండి. అధికారులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహయం అందిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది అని గమనించండి.
 
తుల :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసివస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరుల విషయాలకు, వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాలు ప్రణాళికబద్ధంగా సాగుతాయి. దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఆశయం నెవవేరడానికి బాగా శ్రమిచవలసి వస్తుంది.
 
ధనస్సు :- ఉపాధ్యాయలు మార్పు కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. రావలసిన ధనం చేతికందక పోవడంతో ఆందోళన చెందుతారు. క్రీడా, కళ రంగాల్లో వారికి సంతృప్తి కానరాదు.
 
మకరం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. స్త్రీ కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృత్తి, వ్యాపార సంబంధాలు బలపడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో అభిప్రాయబేధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
 
కుంభం :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉదోగ్యస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కోర్టు దావాలు ఉపసంహరించుకుంటారు. వైద్యులకు మెళుకువ ఏకాగ్రత చాలా అవసరం. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలతో మోసపోయే వీలుంది. మీ సంతానం కోసం ధనం గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి.
 
మీనం :- పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. విదేశాలలోని వారికి వస్తు సామాగ్రి, విలువైన పత్రాలు అందజేస్తారు. నిర్మాణ పనుల్లో వేగం కనబడుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరిస్తారు. బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో ఒకరి సహాయం తీసుకోవటంమంచిది.