ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-03-2023 - ఆదివారం రాశిఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం...

Libra
మేషం :- ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
వృషభం :- నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ వాతావరణం అధికం కావటంతో ఆందోళన చెందుతారు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
మిథునం :- ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సాన్నిహిత్యం నెలకొంటుంది. రవాణా రంగాలవారు స్వల్ప చికాకులను ఎదుర్కొంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్త్రీలు షాపింగుల కోసం ధనం అధికంగా వ్యయంచేస్తారు. 
 
కర్కాటకం :- విదేశాల్లోని అయిన వారి క్షేమసమాచారం సంతృప్తినిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరలు, చిరువ్యాపారులకు అన్నివిధాలా కలసివస్తుంది. స్త్రీలు వాగ్వివాదాలకు దూరంగా ఉండటంమంచిది.
 
సింహం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. కొన్ని విషయాలు చూసీ చూడనట్టుగా వదిలేయండి. వ్యవహారంలో ఖచ్చితంగా ఉండాలి.
 
కన్య :- ఆదాయాని కన్నా ఖర్చులు అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మీ ఆంతరంగిక విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విదేశాలకు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
తుల :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. స్త్రీలకు ఇరుగు పొరుగు విరితో సఖ్యత అంతగా ఉండదు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటుండదు. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది.
 
వృశ్చికం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. సామరస్యంతో మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. కుటింబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి.
 
ధనస్సు :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ సమర్థతను కుటుంబీకులు, సన్నిహితులు గుర్తిస్తారు. విదేశీ యత్నాలువాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ కళత్ర మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులను ఎదుర్కొంటారు.
 
మకరం :- ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. విద్యార్థులు బద్దకాన్ని వదలి చురుగ్గా ఉండండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. మిత్రుల కలయికతో మనశ్సాంతిని పొందుతారు. చిత్తశుద్ధితో మీరు చేసిన సహాయానికి, సేవలకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి రాగలవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూల మవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.