శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-03-2023 బుధవారం మీ రాశిఫలాలు - గాయిత్రి మాతను ఆరాధించిన శుభం..

Gemini
మేషం :- ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు. ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు చేస్తారు. అధికారులతో మాటపడతారు. దైవ దర్శనాలు తేలికగా అనుకూలిస్తాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
 
వృషభం :- మిత్రులతో కలసి ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక తప్పిదం జరిగే ఆస్కారం ఉంది. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు.
 
మిథునం:- బంధువులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎక్స్‌పోర్టు, ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. బ్యాంకు వ్యవహరాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.
 
కర్కాటకం :- బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెలకువ వహించండి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది.
 
సింహం :- గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొండి. చివరి క్షణంలో చేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
కన్య :- దైవ సేవా కార్యక్రమాల్లో ధనం ఖర్చు చేస్తారు. మీ చొరవ, మాటతీరు అందరినీ ఆకట్టుకుంటాయి. లాటరీ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు.
 
తుల :- శత్రువులు మిత్రులుగా మారి సహయం అందిస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారులతో మాటపడక తప్పదు. రవాణా రంగాలలోని వారికి ఇబ్బందులు తప్పవు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో పెరిగిన పోటీ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బందులు, రుణదాతల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలు నూతన వ్యక్తులతో మితంగా సంభాషించడం మంచదని గమనించండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఆపద సమయంలో స్నేహితులు అండగా నిలుస్తారు. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన తప్పదు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. వ్యాపారంలో పెరిగిన పోటీ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం :- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. రాబోయే ఖర్చులకు ముందుగానే ధనం సర్దుబాటు చేసుకుంటారు. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు.
 
కుంభం :- ఆకస్మికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. మీ సృజనాత్మక శక్తికి, తెలివి తేటలకు గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలోవారికి పనిలో వత్తిడి, చికాకులు తప్పవు.
 
మీనం :- అధికారులకు తరుచు పర్యటనలు, తనిఖీలు, స్థానచలనం తప్పక పోవచ్చు. ప్రముఖుల సహకారంతో మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు.