శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-03-23 శుక్రవారం మీ రాశి ఫలితాలు.. కనకదుర్గాదేవిని పూజించినట్లైతే..?

durga2
కనకదుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం: వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సృజనాత్మక శక్తికి, తెలివి తేటలకు గుర్తింపు లభిస్తుంది. విదేశీయానం. రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు తొలగి పోతాయి. 
 
వృషభం :- మీ జీవిత భాగస్వామితో కీలకమైన విషయాలు చర్చలు జరుపుతారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం మీకు లభిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
మిథునం:- విద్యార్థులు తొందరపాటు తనంవదిలి ఏకాగ్రతతో చదివిన సత్ఫలితాలను పొందగలరు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు బదిలీ వార్త ఆందోళన కలిగిస్తుంది. సేవా సంస్థల్లో సభ్యత్వం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను ప్రసన్నం చేసుకోగల్గుతారు. పత్రిక. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేక పోతారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. స్త్రీలకు అర్జనపట్ల, విలాస వస్తువులపట్ల ఆసక్తి, పెరుగుతుంది.
 
సింహం:- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి శ్రమ అధికమవుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణాలలో వ్యయం అంచనాలను మించుతుంది. బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కన్య:- చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. రిప్రజెంటివులు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పానియ, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
తుల:- ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. క్రయ విక్రయాలు వాయిదా పడుట మంచిది. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కాళ్ళు, సరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
వృశ్చికం:- పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. గృహలలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. విద్యార్ధినులకు ఏకాగ్రతా లోపం అధికమవుతుంది. ఎండుమిర్చి కంది, పసుపు, ఉల్లి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి.
 
ధనస్సు:- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు అందుతాయి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది.
 
మకరం:- రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. అయ్యే సూచనలున్నాయి. అనురాగ వాత్సల్యాలు పెంపొందగలవు. విద్యార్ధినులు కొత్త విషయాల పట్ల ఏకాగ్రత, ఉత్సాహం కనబరుస్తారు. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికిఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
కుంభం:- విద్యార్ధినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
మీనం:- గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలించవు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విచ్చల విడిగా వ్యయం చేస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.