ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-03-2023 తేదీ మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా...

astro2
మేషం :- ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. చేపట్టిన పనులు కొంత ఆలస్యమైనా అనుకున్నవిధంగా పూర్తి చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానియ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దలతోను, ప్రముఖులతోనూ మితంగా సంభాషించండి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
వృషభం :- బంధువులకు ధన సహాయం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత వహించిన మంచి ఫలితాలు లభిస్తాయి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- సేవా, పుణ్య కార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో లౌక్యం అవసరం. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
కర్కాటకం :- భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం.
 
సింహం :- ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులకు బదిలీ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి.
 
కన్య :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాలా కలిసిరాగలదు. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. విద్యార్థులు ఉన్నత చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. స్త్రీలకు అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
తుల :- మీ సంతానం ఉన్నత విద్యల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. స్త్రీలకు బంధుమిత్రుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. చేపట్టినపనులు కొంత ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. విద్యార్థులకు చదువులపట్ల ఏకాగ్రత చాలా అసవరం. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. రాజకీయ రంగాల్లో వారికి అరచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ఉద్యోగస్తులకు పని భారం అధికమవుతుంది.
 
ధనస్సు :- ఫాన్సీ, కిరణా, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఖర్చులు రాబడికి తగినట్లే ఉండటంతో ఇబ్బందులంతగా ఉండవు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఉద్యోగయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
మకరం :- నిరుద్యోగులకు కలిసివచ్చే కాలం. చిన్నతరహా పరిశ్రమల వారికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులలో జాప్యం, చికాకులు ఎదుర్కుంటారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలన్న మీ ధ్యేయం త్వరలో నెరవేరుతుంది.
 
కుంభం :- ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. పెద్దల ఆరోగ్య, ఆహార విషయాల్లో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి పాత బాకీలు వసూలవుతాయి. పదవీ విరమణ చేసిన వారికి రావలసిన గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణంచేస్తారు.
 
మీనం :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తువ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. భాగస్వామిక చర్చలు అనుకూలిస్తాయి. అదనపు సంపాదనకు మార్గాలు అన్వేషిస్తారు. కీలకమైన వ్యవహరాల్లో మీ జీవితభాగస్వామి సలహా, ఎంతగానో ఉపకరిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది.