ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-03-2023 తేదీ బుధవారం దినఫలాలు - గణపతిని గరికెతో పూజించినా శుభం..

Sagitarus
మేషం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్నీ మీకు అనుకూలంగా మలుచుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. సోదరీ, సోదరులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం :- మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఉన్నత హోదాలో ఉన్న అధికారులు అపరిచిత వ్యక్తులను దూరంగా ఉంచటం క్షేమదాయకం.
 
మిథునం :- గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు అధికం, ధనం మితంగా వ్యయం చేయండి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాహనచోదకులకు ఆటంకాలు తప్పవు.
 
కర్కాటకం :- నిరుద్యోగులు, అవివాహితులకు శుభవార్తలు అందుతాయి. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచనమంచిది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. దూర ఇష్టం లేకున్నా కొన్ని విషయాల్లో సర్దుకుపోవలసి వస్తుంది.
 
సింహం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. రావలసిన ధనం వాయిదాపడుతుంది. స్త్రీలు వేడుకలలోనూ, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ వహించండి.
 
కన్య :- స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఆలయ సందర్శనాలలో నూతన వ్యక్తులను కలుసుకుంటారు. స్థిరాస్తిని అమర్చుకుంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. కార్యసాధనలో జయం పొందుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.
 
తుల :- కీలకమైన వ్యవహరాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం మంచిది. దంపతుల మధ్య అనురాగ వాత్సాల్యాలు పెంపొందుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. విదేశీయానం, రుణ యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
 
వృశ్చికం :- విద్యార్థినులు పట్టుదలతో శ్రమించి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. గృహంలో ఒక శుభకార్యం దిగ్విజయంగా నిర్వహిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు, ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి.
 
ధనస్సు :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. స్వయం కృషితో అభివృద్ధి చెందుతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు బ్యాంకు రుణాలు మంజూరవుతాయి.
 
మకరం :- వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. 
 
కుంభం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. నూతన వ్యక్తులతో పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పెద్దల ఆర్యోగంలో మెళుకవ అవసరం. దూర ప్రయాణాలలోనూతన వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి.
 
మీనం :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తి, పురోభివృద్ధి. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. స్థిరాస్తి క్రయ లేక విక్రయ దిశగా మీ ఆలోచనలంటాయి.