గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 24-02-2023 శుక్రవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల శుభం...

Cancer
మేషం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. 
 
వృషభం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. వ్యాపారాల్లో పోటీతనం ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం. కుటుంబీకులతో దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
మిథునం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో మీ స్థాయి పెరుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఏకాగ్రత వహించలేరు. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబంలోని వారి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసివస్తుంది. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బందిపడతారు. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విద్యార్ధుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
సింహం :- వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్థిక సంతృప్తి ఉండదు. రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కోర్టు, భూవివాదాలు పరిష్కరించబడతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. మీ సోదరితో సంబంధ బాంధవ్యాలు సామాన్యంగా ఉండగలవు. శత్రువులు మిత్రులుగా మారతారు.
 
తుల :- ప్రభుత్వాధికారుల నుంచి ఒత్తిడి, వేధింపులు అధికమవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. మీ లోటుపాట్లు, తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. బంధు మిత్రుల రాక వల్ల మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
 
వృశ్చికం :- ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. మీ సంతానం వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.
 
ధనస్సు :- వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. బ్యాంకు పనులు హడావిడిగా సాగుతాయి. విద్యార్థులకు మొండితనం అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. పాత రుణాలు తీర్చ గలుగుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఫ్లీడరు, ఫ్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు.
 
కుంభం :- వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. కాంట్రాక్టర్లకు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
మీనం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు జాగ్రత అవసరం. మీ మాటతీరు, మన్ననలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశంవుంది.