మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 22-02-2023 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా...

Gemini
మేషం :- ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఆలయాలలో బంధు మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలలో వస్తువులు పోయే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. 
 
వృషభం :- విద్యుత్ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థినులకు ఒత్తిడి, నిరుత్సాహం వంటివి తప్పవు. మీ వాక్చాతుర్యం అందరిని ఆకట్టుకుంటుంది. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.
 
మిథునం :-స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. అందరినీ అతిగా నమ్యే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. షేర్ మార్కెట్ రంగాల వారికి మెలకువ అవసరం.
 
కర్కాటకం :- ఆర్థికస్థితిలో ఆశాజనకమైన మార్పులుంటాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. స్త్రీలు దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరి ప్రసంశలను పొందుతారు. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. పాత వస్తువులనుకొని ఇబ్బందులు తెచ్చుకోకండి. ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు ఎదుటివారు యత్నిస్తారు.
 
కన్య :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. మీ విరోధులు వేసే పథకాలు తిప్పిగొట్టగలుగుతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
తుల :- పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అసవరం. విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఒంటెత్తుపోకడ మంచిది కాదని గమనించండి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది.
 
వృశ్చికం :- మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే మీ కోరిక నెరవేరుతుంది. బంధువులను కలుసుకుంటారు.
 
ధనస్సు :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. విదేశీ యానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించట వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. వృత్తిపరంగా ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు.
 
మకరం :- చిన్నతరహా పరిశ్రమలలో వారికి అభివృద్ధి కానవస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఉద్యోగులు గుర్తింపు కోసం చేసే ప్రయత్నాల అనుకూలిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రవాణా రంగాల వారికి సమస్యలు అధికమవుతాయి. బ్యాంకు రుణాలు తీరుస్తారు. కొంతమంది మీతో స్నేహం నటిస్తూనే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
 
మీనం :- ఆర్థిక పరిస్థితులు కొంత నిరుత్సాహపరుస్తాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఏ విషయంపై అయినా స్పందించే ముందు పరిణామాలు ఎలా ఉంటాయో మరొక్కసారి ఆలోచించండి. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.